ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పేపర్ లేదా గోనె సంచులు వంటి పర్యావరణహిత వస్తువులను ఉపయోగించాలి: మై భారత్ వాలంటీర్ సాయి వర్ధన్ రెడ్డి కైల

నవపక్షం, వికారాబాద్, సెప్టెంబర్ 30: మై భారత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సేవా పక్వాడ’ కార్యక్రమంలో భాగంగా మై భారత్ వాలంటీర్ కైల సాయివర్ధన్ రెడ్డి బుధవారం లైబ్రరీ ఆవరణలో ప్లాస్టిక్ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు,స్థానికులతో కలిసి లైబ్రరీ పరిసరాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని సాయివర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. పరిశుభ్రమైన పరిసరాల కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్లాస్టిక్ వాడడాన్ని తగ్గించి పర్యావరణానికి హాని కలిగించని పేపర్ లేదా...