నవపక్షం , శాలిగౌరారం ప్రతినిధి :
జిల్లా స్థాయి కబడ్డీ క్రీడ పోటీల్లో మండల పరిధిలోని వల్లాల ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థులు మెరిశారు. దేవరకొండలో జరిగిన జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 17 కబడ్డీ బాలికల విభాగంలో అత్యంత ప్రతిభ కనబరచి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.వీరిలో మంచి ప్రతిభ కనబరిచిన ఎస్.కె.నస్రిన్,ఎస్ కే రెహనా బాలికల విభాగంలో,పర్వతం విజయ్ అండర్ 17 బాలుర విభాగంలో నల్లగొండ జోన్ కు ఎంపికైనట్లు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణ మోహన్ తెలిపారు. జిల్లాస్థాయిలో మంచి ప్రతిభ కనబరచి, నల్లగొండ జోన్ కు ఎంపికైన విద్యార్థులను,పిడి మల్లేష్ ను ఉపాధ్యాయ బృందం అభినందించారు.



