డిండి లిఫ్ట్ ఇరిగేషన్‌పై కోదండరాం వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి – ఉప్పు కృష్ణ
నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి : డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయాలంటూ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్‌ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు ఉప్పు కృష్ణ డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం నిర్వహించిన పాదయాత్రను ప్రారంభించిన సందర్భంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై కోదండరాం చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల సాగునీటి అవసరాల నేపథ్యంలో అభ్యంతరకరంగా ఉన్నాయని ఉప్పు...