భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి
నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి: ఎన్నో ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపకుండా, 22A నిషేధిత భూముల జాబితా పేరుతో రైతులు, భూ యజమానులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు ఉప్పు కృష్ణ ఆరోపించారు. అసైన్డ్, సీలింగ్ భూములకు పట్టాలు లేకపోయినా ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబాలు, తమ అవసరాల కోసం భూమిని కొనుగోలు చేయడం, విక్రయించడం వంటి విషయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పిల్లల ఉన్నత...