కోల్క్ందలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు – సర్పంచ్ బసేట్టి విశాల సంగమేశ్వర్
నవపక్షం, వికారాబాద్ ప్రతినిధి : మోమినిపేట మండల పరిధిలోనిచిన్న కోల్కొంద గ్రామంలో గాంధీ జయంతి వేడుకలను గ్రామ సర్పంచ్, బసెట్టి విశాల, సంగమేశ్వర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం సర్పంచ్ గ్రామ సభ నిర్వహించి, గ్రామ అభివృద్ధి పై పలు అంశాలను చర్చించారు. వర్షపు నీటి సంరక్షణలో భాగంగా జలసిరి కార్యక్రమాలు చేపట్టి ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామచంద్రయ్య పంచాయతి కార్యదర్శి ఇందిర వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.