భువనగిరి రిలయన్స్ రిటైల్ లిమిటెడ్‌లో ఆహార భద్రతా అధికారుల తనిఖీలు

నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి : భువనగిరి పట్టణంలోని రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ సూపర్ మార్కెట్‌లో ఆహార భద్రతా నిబంధనల అమలును పరిశీలించేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వంకాయలపాటి జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ పి. స్వాతి ఈ తనిఖీలు చేపట్టారు. తనిఖీల సందర్భంగా ఆహార భద్రత, పరిశుభ్రత, నిల్వ, లేబులింగ్, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. తనిఖీల సమయంలో సంబంధిత సంస్థలో కొన్ని ఆహార భద్రతా...