జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో లో సత్తా చాటిన కేజీబివి విద్యార్థినులు

నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి : జిల్లా స్థాయి కబడ్డీ క్రీడ పోటీల్లో మండల పరిధిలోని కేజీబివి కి చెందిన విద్యార్థినులు సత్తా చాటారు.దేవరకొండలో జరిగిన జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 కబడ్డీ బాలికల విభాగంలో వానరాశి సుప్రియ,జి. శ్వేత మంచి ప్రతిభ కనబరచి ప్రధమ స్థానం,అండర్ 17 కబడ్డీ లో ఎస్. మమత,ఎస్ గంగా భవాని ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.జిల్లాస్థాయిలో మంచి ప్రతిభ కనబరచిన విద్యార్థినులను,పీఈటి స్వప్న ను ఉపాధ్యాయ బృందం అభినందించారు.