గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ వస్త్రాల ప్రదర్శన సందర్శించిన లక్ష్మీ భార్గవి దువ్వాడ

నవపక్షం, విశాఖపట్నం ప్రతినిధి : గాంధీ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌ను పురస్కరించుకుని టీడీపీ నాయకురాలు లక్ష్మీ భార్గవి దువ్వాడ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ చోదే వెంకట పట్టాభిరామ్ తో కలిసి ఖాదీ సంతలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ప్రదర్శనను సందర్శించారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ ప్రోత్సహించిన ఖాదీ, చేనేత రంగాల ప్రాధాన్యతను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, స్వదేశీ భావాలు...