మహాత్మ గాంధీ జయంతి వేడుకలు
నవపక్షం, కోట ప్రతినిధి : కోట మండలం గూడలి గ్రామంలో మహాత్మా గాంధీజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లె మల్లు వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పల్లె మల్లు వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ, మహాత్మా గాంధీజీ సత్యం, అహింసా మార్గాలను అనుసరిస్తూ భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.దండి యాత్ర,సహాయ నిరాకరణ ఉద్యమం వంటి కార్యక్రమాల...