నేడు నల్లబెల్లికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాక
నవపక్షం, నల్లబెల్లి: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేడు నల్లబెల్లికి రానున్నారు. ఉద్యమ నాయకుడు, దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేయడంతో పాటు, ఆయన కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదార్చనున్నారు. అనంతరం నర్సంపేట నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిసి వారికి ధైర్యం చెప్పనున్నారు. పార్టీ శ్రేణులతో మాట్లాడి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్...