కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కొమ్మనబోయిన సైదులు యాదవ్
నవపక్షం, హైదరాబాద్: బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్ బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ను నందినగర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన అనంతరం తొలిసారిగా కేటీఆర్‌ను సైదులు యాదవ్ కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ, విద్యార్థి సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం, బీసీ విద్యార్థుల హక్కులు, విద్యా రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలపై భవిష్యత్‌లో మరింత చురుగ్గా పనిచేయాలని ఈ సందర్భంగా చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ...