నకిరేకల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి డీసీఎంను ఢీకొన్న బుల్లెట్.. ఘటనాస్థలంలోనే మృతి

నవపక్షం, నల్గొండ జిల్లా ప్రతినిధి : నకిరేకల్ పట్టణంలోని పద్మానగర్ బైపాస్ జంక్షన్ వద్ద హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బుల్లెట్‌పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, పద్మానగర్ బైపాస్ జంక్షన్ వద్ద ఓ డీసీఎం వాహనం రోడ్డు దాటుతున్న సమయంలో విజయవాడ వైపు నుంచి బుల్లెట్‌పై వచ్చిన వ్యక్తి డీసీఎంను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బుల్లెట్‌పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు పోలీసులు...