ఇకపై బుక్ చేసిన 3 గంటల్లోనే ఇంటికే గ్యాస్ సిలిండర్!
ఇండియన్ ఆయిల్ సంస్థ ‘ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ’ పేరుతో కొత్త సేవను ప్రారంభించింది. ఈ సేవ ద్వారా 10 కిలోల తేలికపాటి కాంపోజిట్ ఎల్‌పీజీ సిలిండర్‌ను బుక్ చేసిన మూడు గంటల్లోనే వినియోగదారుల ఇంటి వద్దకు డెలివరీ చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ కాంపోజిట్ సిలిండర్‌కు పారదర్శక బాడీ ఉండటంతో సిలిండర్‌లో మిగిలి ఉన్న గ్యాస్ స్థాయిని వినియోగదారులు సులభంగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఇది తేలికగా ఉండటంతో పాటు తుప్పు పట్టని విధంగా రూపొందించబడింది. వినియోగదారులు IndianOil ONE యాప్, వెబ్‌సైట్ లేదా వాట్సాప్...