గురజాలలో ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం 120 మందికి కంటి పరీక్షలు.. 15 మందికి ఉచిత ఆపరేషన్లు

నవపక్షం, ఆగస్టు 9, శాలిగౌరారం: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత కంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో లయన్స్ క్లబ్ ఆఫ్ శాలిగౌరారం ఆధ్వర్యంలో, సూర్యాపేట లయన్స్ కంటి ఆసుపత్రి సహకారంతో గురజాల గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించగా, మొత్తం 120 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. గురజాల గ్రామ సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్ ఆధ్వర్యంలో ఆయన తల్లిదండ్రులు క్రీస్తుశేషులు ఎర్ర యాదయ్య, వెంకటమ్మ జ్ఞాపకార్థం శిబిరానికి హాజరైన వారికి...