ఆదివాసులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు – రాకేష్ వర్మ

నవపక్షం ప్రతినిధి, భూపాలపల్లి భూపాలపల్లి, ఆగస్టు 9: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సోదర సోదరీమణులకు భూపాలపల్లి బీజేపీ యువమోర్చ నాయకులు బిళ్ల రాకేష్ వర్మ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాకేష్ వర్మ మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేశ అభివృద్ధిలో ఆదివాసీ సమాజం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఆదివాసీల విద్య, ఉపాధి, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వాలు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు....