పర్యావరణ హితంగా మర్రి ఆనందం 75వ జన్మదిన వేడుకలు
నవపక్షం, మోత్కూర్ : రిటైర్డ్ ఎంప్లాయిస్ మోత్కూర్ యూనిట్ పూర్వ మండల అధ్యక్షులు మర్రి ఆనందం 75వ జన్మదిన వేడుకలను పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ శనివారం ఘనంగా నిర్వహించారు. మోత్కూర్‌లోని ముత్యాలమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో రావి, వేప మొక్కలను నాటి పచ్చదన సందేశాన్ని చాటిచెప్పారు. ఈ సందర్భంగా మర్రి ఆనందం ఆత్మీయులు, శాఖా గ్రంధాలయం మోత్కూర్ చైర్మన్ కోమటి మత్స్యగిరి ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమాజ సేవ, ఉద్యోగుల సంక్షేమం కోసం మర్రి ఆనందం చేసిన సేవలను...