ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివాసీ సంస్కృతికి వందనం.. గిరిజనుల అభ్యున్నతికి కట్టుబాటు
నవపక్షం, విజయనగరం జిల్లా ప్రతినిధి, ఆగస్టు 9: విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్.ఆర్.ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన సోదరులు తమ సంప్రదాయ థింసా నృత్యంతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం గిరిజన వనదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...