ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఘనంగా బోనాల సంబరాలు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ఆగస్టు 09: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం, మన్సూరాబాద్, కొత్తపేట, నాగోల్ డివిజన్లలో బోనాల పండుగ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పలు అమ్మవారి దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ...