జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కొమురం భీమ్ విగ్రహాలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, అధికారులు ఘన నివాళులు
నవపక్షం, భూపాలపల్లి బ్యూరో, ఆగస్టు 09: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు బీఎన్ సంతోష్ (IAS), జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ (IAS), ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వట్సల్ టొప్పో (IAS) ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అధికారికంగా కార్యక్రమాలను నిర్వహించారు. మహదేవపూర్‌లోని ఐటీడీఏ కార్యాలయ సముదాయంలో ఆదివాసీ నాయకులు, గిరిజన ప్రజలు, విద్యార్థుల సమక్షంలో ఆదివాసీ పోరాట వీరుడు స్వర్గీయ కొమురం భీమ్ శిలా విగ్రహానికి...