ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నాగేందర్ గౌడ్? పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీకి సన్నాహాలు.. బీఆర్‌ఎస్ టికెట్‌పై ఆశలు సుదీర్ఘ రాజకీయ అనుభవం, బీసీ సామాజిక సమీకరణాలపై ధీమా

నవపక్షం, తెలంగాణ బ్యూరో : వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఇప్పటి నుంచే సమీకరణాలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతుండగా, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు నాగేందర్ గౌడ్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. బీఆర్‌ఎస్ నుంచి బరిలోకి దిగేందుకు సన్నాహాలు తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీతో అనుబంధాన్ని కొనసాగిస్తూ, సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న నాగేందర్ గౌడ్.. వచ్చే...