పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
నవపక్షం, దమ్మపేట, ఆగస్టు 09: దమ్మపేట మండలంలో పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. అశ్వారావుపేటలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం దమ్మపేట మండల పరిధిలోని మారప్పగూడెం, నాచారం, నాగుపల్లి గ్రామాల్లో పలు నూతన భవనాలు, సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మంత్రి సీతక్కను ఆహ్వానించగానే స్పందించి పర్యటనకు వచ్చినందుకు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఏజెన్సీ ప్రాంత...