డప్పుల మోతతో దద్దరిల్లిన లార్డ్స్ స్కూల్… ఘనంగా బోనాల సంబురాలు
నవపక్షం : రంగారెడ్డి బ్యూరో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను బి.ఎన్.రెడ్డి నగర్‌లోని వినాయక హిల్స్ లార్డ్స్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొనడంతో పాఠశాల ఆవరణం పండుగ వాతావరణంతో కళకళలాడింది. ఈ వేడుకలకు పాఠశాల చైర్మన్ సిద్ధాల బీరప్ప ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఆశీర్వదించారు. వైస్ చైర్మన్ బెర్లూ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ సిద్ధాల శ్రీలత, ప్రిన్సిపాల్ జ్యోతిర్మయి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థినులు సంప్రదాయ పద్ధతిలో అలంకరించిన...