బాలాజీ ప్లైవుడ్ & హార్డ్‌వేర్ షాపును ప్రారంభించిన వేముల వీరేశం

నవపక్షం, నకిరేకల్ మున్సిపాలిటీ ప్రతినిధి: తిపర్తి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ ప్లైవుడ్ & హార్డ్‌వేర్ షాపును ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వేముల వీరేశం, వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. వినియోగదారులకు నాణ్యమైన ప్లైవుడ్, హార్డ్‌వేర్ ఉత్పత్తులను అందిస్తూ ప్రజల ఆదరణ పొందాలని సూచించారు. స్థానికంగా నూతన వ్యాపార సంస్థలు ఏర్పాటవడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పట్టణ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు....