యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ యువత, విద్యార్థి వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి: యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వేజండ్ల సాయికుమార్

ఖమ్మం: యువత శక్తిని జాతీయ నిర్మాణానికి వినియోగించడంతో పాటు, నిరుద్యోగం, విద్య, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలు, యువత హక్కులపై అవగాహన కల్పించడం, ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాలు నిర్వహించడమే యువజన కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేజండ్ల సాయికుమార్ అన్నారు. యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం నగరంలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో వేజండ్ల సాయికుమార్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి...