ఇంటింటికీ కళ్లద్దాల పంపిణీ చేసిన 20వ వార్డు కౌన్సిలర్ ఎం.డి. హన్ను బాయ్
నవపక్షం, మునుగోడు ప్రతినిధి : శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి వచ్చిన కళ్లద్దాలను 20వ వార్డు కౌన్సిలర్ ఎం.డి. హన్ను బాయ్ ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఊడుగు వెంకటేశం గౌడ్ తో కలిసి వార్డులోని ప్రజలకు వారి ఇళ్ల వద్దే కళ్లద్దాలను అందజేశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా కంటి వైద్య...