చేతి వృత్తులవారందరూ శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకలు టీడీపీ జాతీయ వైస్ ప్రెసిడెంట్ వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్

నవపక్షం, ఉయ్యూరు ప్రతినిధి, ఆగస్టు 10: చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులందరూ శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకలని తెలుగుదేశం పార్టీ జాతీయ వైస్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఉయ్యూరులోని ఏపీ ఎన్జీవో హోమ్‌లో సోమవారం ఆటో వర్కర్స్, బ్యాటరీస్, టైర్స్ రంగాలకు చెందిన యూనియన్ నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, టూ వీలర్ మెకానిక్స్‌తో పాటు ఆటోమొబైల్ రంగానికి చెందిన కార్మికులంతా కవి శ్రీశ్రీ...