శ్రీ వాత్సల్య పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు

వరంగల్ ఆరేపల్లి, ఆగస్టు 10 (నవపక్షం జిల్లా ప్రతినిధి – బండారి తిరుపతి): వరంగల్ ఆరేపల్లిలోని శ్రీ వాత్సల్య పాఠశాలలో బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను పురస్కరించుకుని పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. బాలికలు బోనాలను అందంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సమర్పించారు. విద్యార్థులు తెలంగాణ జానపద పాటలు, నృత్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా...