విశ్రాంత ఉద్యోగి ఉప్పల మల్లయ్యకు మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి నివాళులు

నవపక్షం, తిరుమలగిరి ప్రతినిధి: తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీకి చెందిన ప్రముఖ వ్యక్తి, విశ్రాంత ఉద్యోగి గిలకత్తుల ఉప్పల మల్లయ్య ఇటీవల మృతి చెందారు. ఆయన దశదిన కార్యక్రమంలో తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి పాల్గొని, ఉప్పల మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఉప్పల మల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మల్లయ్య మృతి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్...