టీటీడీ జేఈవోగా శ్రీ ప్రభల గోపీనాథ్ బాధ్యతలు స్వీకరణ
తిరుమల, ఆగస్టు 10 (నవపక్షం): టీటీడీ నూతన జేఈవో (వైద్యం, విద్య)గా నియమితులైన శ్రీ ప్రభల గోపీనాథ్ సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, బోర్డు సెల్ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.