మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వ భరోసా 4.21 లక్షల మంది నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా
నవపక్షం, హైదరాబాద్ బ్యూరో: రాష్ట్రంలోని నమోదిత మత్స్యకారుల సామాజిక భద్రతకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా 4,21,767 మంది నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా పథకం (GAIS) అమలు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం, జీవనోపాధి భద్రత, సామాజిక రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత...