పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం 36 ఏళ్ల తర్వాత కలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న 1989–90 బ్యాచ్ విద్యార్థులు
నవపక్షం, దమ్మపేట ప్రతినిధి: దమ్మపేట జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 1989–90 సంవత్సరాల్లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం దమ్మపేటలోని స్థానిక వాసవి క్లబ్ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థి షేక్ ఖాసిం అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో తొలుత దమ్మపేట మండల కేంద్రానికి చెందిన జీసీసీ హమాలీ కార్మికుడు భోగిం సత్యంను ఘనంగా సన్మానించారు. కూలి పనులు చేస్తూనే తన ముగ్గురు కుమార్తెలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది, తండ్రిగా విజయాన్ని సాధించిన సత్యం సేవలను పూర్వ...