భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ క్యామ మల్లేష్‌ను పరామర్శించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి: ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురై తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న బీఆర్‌ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ క్యామ మల్లేష్ ను బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పరామర్శించారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో కలిసి కేటీఆర్ క్యామ మల్లేష్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా క్యామ మల్లేష్ యోగక్షేమాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. త్వరగా సంపూర్ణ...