శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోషకాహారం పంపిణీ
నవపక్షం, శాలిగౌరారం ప్రతినిధి : శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ శాలిగౌరారం ఆధ్వర్యంలో గర్భిణీ మహిళలకు పోషకాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ క్లబ్ దాతలు చామల లతారెడ్డి - రామచంద్రారెడ్డి దంపతుల సహకారంతో గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు నిమ్మల ఆంజనేయులు మాట్లాడుతూ గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. సమాజంలో అవసరమైన వారికి సేవ చేయడమే లయన్స్ క్లబ్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో చార్టెడ్ ప్రెసిడెంట్ బుడిగ...