నకిరేకల్‌లో ఉచిత నేత్ర వైద్య శిబిరం ప్రారంభం – వేముల వీరేశం
నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, పుష్పగిరి ఆస్పత్రి సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత నేత్ర శస్త్ర చికిత్స శిబిరాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పుష్పగిరి ఆస్పత్రి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు ఉచిత కంటి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. కంటి పరీక్షలు నిర్వహించి, శస్త్ర చికిత్స అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయడంతో పాటు, ఆపరేషన్ అనంతరం ఉచితంగా...