ప్రభుత్వ సొమ్ముతో వరుణ యాగాలు చేయడం సిగ్గుచేటు – మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నాగార్జునసాగర్‌లో వరుణ యాగం పేరుతో ప్రభుత్వ సొమ్ముతో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు యజ్ఞాలు నిర్వహించడం సిగ్గుచేటని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రంగా విమర్శించారు. నకిరేకల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, అధికారులు ముందుగానే హెచ్చరించినా ప్రభుత్వం తగిన ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కాళేశ్వరం నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్ వరకు అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోలేకపోయారని, కనీసం గ్రామాల్లోని చెరువులను కూడా నింపలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు....