శ్రీరామ హృదయం కలశం శోభాయాత్రలో పాల్గొన్న డా. చందుపట్ల కీర్తి రెడ్డి
నవపక్షం, భూపాలపల్లి ప్రతినిధి: శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం, వికాస తరంగిణి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ చిన్న జీయర్ స్వామి 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన “శ్రీరామ హృదయం కలశం” శోభాయాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. చందుపట్ల కీర్తి రెడ్డి, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ ఏడునూతుల నిషిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. చందుపట్ల కీర్తి రెడ్డి మాట్లాడుతూ, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా...