ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తి ఉండాలి.. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలి – డా. చందుపట్ల కీర్తి రెడ్డి

వపక్షం, భూపాలపల్లి ప్రతినిధి : హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు, రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచంద్రరావు ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హర్ ఘర్ తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు. జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ ఏడునూతుల నిషిధర్ రెడ్డి ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలోని హనుమాన్ టెంపుల్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు నిర్వహించిన తిరంగా యాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. చందుపట్ల కీర్తి రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతబూని...