అశ్వరావుపేట మండలంలోని తిరుమలకుంట, మామిళ్లవారిగూడెం గ్రామాల్లో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పర్యటన
నవపక్షం, అశ్వరావుపేట ప్రతినిధి: అశ్వారావు పేట నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అశ్వరావుపేట మండలంలోని తిరుమలకుంట, మామిళ్లవారిగూడెం గ్రామాల్లో పర్యటించారు. ముందుగా తిరుమలకుంట గ్రామంలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని సందర్శించారు. సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు, విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మామిళ్లవారిగూడెం గ్రామంలో...