బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న BGR ఫౌండేషన్ చైర్మన్ బచ్చుపల్లి గంగాధర్ రావు
నవపక్షం, నకిరేకల్ మండలం: నకిరేకల్ మండలంలోని తన స్వగ్రామం మంగళపల్లిలో ఘనంగా నిర్వహించిన బోనాల పండుగ వేడుకల్లో BGR ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ నేత బచ్చుపల్లి గంగాధర్ రావు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ గాధరి జయమ్మ రాఘవులు ఆధ్వర్యంలో గ్రామ పాలకవర్గం, గ్రామ పెద్దలు, తాజా మరియు మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజల సమైక్యతతో బోనాల వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా బచ్చుపల్లి గంగాధర్ రావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో...