కార్మిక–రైతు వ్యతిరేక బీజేపీ విధానాలను తిప్పికొట్టాలి సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: ఎండీ ఇమ్రాన్
నవపక్షం, భువనగిరి ప్రతినిధి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలంతా ఐక్యంగా తిప్పికొట్టాలని సీపీఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండీ ఇమ్రాన్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐటీయూసీ, సీపీఐ భువనగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచార జాతను శుక్రవారం భువనగిరి పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఎండీ ఇమ్రాన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులు, రైతులు, సామాన్య ప్రజల...