మతోన్మాద శక్తులకు ప్రజలే గోరి కడతారు దళితుల పక్షాన కాంగ్రెస్ నిరంతరం నిలుస్తుంది: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

నవపక్షం, కొత్తగూడెం ప్రతినిధి : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై బీజేపీ మతోన్మాద శక్తులు ప్రదర్శించిన దళిత వివక్షను నిరసిస్తూ కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ, సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. పాత బస్ డిపో సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ సెంటర్ వరకు నిర్వహించిన నిరసన ర్యాలీ అనంతరం గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నాయకత్వం వహించారు. కాంగ్రెస్...