స్వతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక
నవపక్షం, నారాయణపేట ప్రతినిధి: స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా, విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సీహెచ్. ప్రియాంక శుక్రవారం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో పరిశీలించారు. అదనపు కలెక్టర్ శ్రీను, అదనపు ఎస్పీ ఎం.డి. రియాజ్ హుల్ హక్ తదితర అధికారులతో కలిసి వేడుకల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రజలు, విద్యార్థులు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అధికారులను...