చైన్ స్నాచింగ్ కేసు ఛేదనలో ఎస్సైకి ప్రశంసలు ఎస్సై బంధం రాజేష్ కుమార్‌ను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
నవపక్షం, దమ్మపేట ప్రతినిధి: చైన్ స్నాచింగ్ కేసును చాకచక్యంగా ఛేదించి నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్సై బంధం రాజేష్ కుమార్ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో ఎస్సైకి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కేసుల పరిష్కారంలో ఎస్సై రాజేష్ కుమార్ చూపిన చొరవ, సమర్థవంతమైన దర్యాప్తు అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా పోలీసులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది...