రైతుల పొలాలను పరిశీలించిన డా. ఈటెల సత్యనారాయణ – పంటల యాజమాన్యంపై సమగ్ర సూచనలు

నవపక్షం, నారాయణపేట ప్రతినిధి: నారాయణపేట మండలం సింగారం గ్రామంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, నారాయణపేట సమన్వయకర్త డా. ఈటెల సత్యనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్, వ్యవసాయ విస్తరణ అధికారి అనిల్ రైతుల పొలాలను సందర్శించి వరి, పత్తి, కంది పంటల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడి పంటల ప్రస్తుత పరిస్థితి, ఎరువుల వినియోగం, కలుపు నివారణ, తెగుళ్లు, చీడపీడల నియంత్రణ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై పలు సూచనలు చేశారు....