మహబూబ్‌నగర్‌లో ఘనంగా తిరంగ ర్యాలీ – దేశభక్తి నినాదాలతో మార్మోగిన పట్టణం
నవపక్షం, మహబూబ్‌నగర్ ప్రతినిధి: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఘనంగా తిరంగ ర్యాలీ నిర్వహించారు. న్యూ టౌన్ నుంచి క్లాక్ టవర్ వరకు సాగిన ఈ ర్యాలీలో ఎంపీ డీకే అరుణ తన మనవళ్లతో కలిసి పాల్గొని జాతీయ జెండాను చేతబూని యాత్రలో నడిచారు. తిరంగ ర్యాలీ సందర్భంగా మహబూబ్‌నగర్ పట్టణం త్రివర్ణ పతాకాలతో ముస్తాబైంది. దేశభక్తి నినాదాలతో ర్యాలీ ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. విద్యార్థులు, యువత, వివిధ సంఘాల నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో...