పంచలింగాల్‌లో బీఆర్ఎస్‌కు యువత భారీ మద్దతు వివిధ పార్టీల నుంచి 80 మంది యువకులు బీఆర్ఎస్‌లో చేరిక
నవపక్షం, మర్పల్లి ప్రతినిధి : వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పంచలింగాల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నూతన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యకర్తల సమావేశంలో పాల్గొని గ్రామంలోని పార్టీ శ్రేణులకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు....