రామలింగంపల్లిలో వేదిక కన్వెన్షన్ హాల్ ప్రారంభం గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక సౌకర్యాలు అభినందనీయం: ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

నవపక్షం, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం రామలింగంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వేదిక కన్వెన్షన్ హాల్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఆధునిక సౌకర్యాలతో కూడిన కన్వెన్షన్ హాళ్లు అందుబాటులోకి రావడం శుభపరిణామమని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా వివాహాలు, శుభకార్యాలు, సమావేశాలు, ఇతర సామాజిక కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు ఇటువంటి వేదికలు...