వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

నవపక్షం, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని రైతులు ఈ వానాకాలంలో వరి సాగు విషయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. వరి సాగుకు అవసరమైన స్థాయిలో నీటి లభ్యత ఉండే పరిస్థితులు లేకపోవడంతో, రైతులు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం బోర్లలో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా...