ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి
నవపక్షం, నెల్లిమర్ల ప్రతినిధి: ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి పరిష్కారం చూపించడమే లక్ష్యంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ముంజేరు క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ, ఇళ్ల స్థలాలు, విద్యుత్ సమస్యలు తదితర అంశాలకు సంబంధించి ప్రజలు సమర్పించిన వినతులను ఎమ్మెల్యే శ్రద్ధగా విని, సమస్యల తీవ్రతను తెలుసుకున్నారు. పలువురు అర్జీదారుల సమస్యలపై సంబంధిత అధికారులతో వెంటనే ఫోన్‌లో...