పండుగ సాయన్న జయంతికి అధికారిక గుర్తింపు అక్టోబర్ 22న అధికారికంగా నిర్వహణకు సీఎం రేవంత్ రెడ్డి హామీ త్వరలో జీవో విడుదల
నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ముదిరాజ్ సమాజ ఆరాధ్య దైవంగా భావించే వీరుడు పండుగ సాయన్న జయంతిని ప్రతి సంవత్సరం అక్టోబర్ 22న అధికారికంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన జీవోను త్వరలో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో ముదిరాజ్ సమాజంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎంను కలిసిన పండుగ సాయన్న జయంతి–వర్ధంతి నిర్ధారణ కమిటీ శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బోర్ర జ్ఞానేశ్వర్, మహబూబ్‌నగర్...